Tuesday 10 April 2012

ప్రతి కుటుంబంలో జూ.ఎన్టీఆర్ లాంటి కొడుకు

ఎన్టీఆర్‌ని మాస్ హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసేవారికి ఆయన మాస్‌తో పాటు ఫ్యామిలీ హీరోగా కనిపిస్తారు. ప్రతి కుటుంబంలో ఇలాంటి కొడుకు, ఇలాంటి హీరో ఉండాలని అందరూ కోరుకునేలా ఉంటుంది ఆయన పాత్ర అంటున్నారు దమ్ము నిర్మాత కె.ఎస్ రామారావు. బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న తమ చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
 అలాగే ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్ళు తెప్పిస్తాయి. రామ్-లక్ష్మణ్ ఫైట్లు కొత్తగా ఉంటాయి. కీరవాణి సంగీతం, రత్నం డైలాగులు, ఆర్థర్ విల్సన్ పనితనం తెరమీద కనిపిస్తుంది. మా సంస్థలో తప్పకుండా పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుంది. ఇక చిత్రం రికార్డింగ్ పూర్తి కావచ్చింది. మరో 10 రోజుల్లో సెన్సార్‌కు వెళ్తాం. ప్రేక్షకులు ఆశించేదాన్ని మించి బోయపాటి శ్రీను చిత్రాన్ని తీర్చిదిద్దారు. 100 శాతం నిబద్ధతతో తెరకెక్కించారు. లెజండరీ చిత్రమవుతుంది అని చెప్పుకొచ్చారు. 

ఇక ఇప్పటికే విడుదలైన దమ్ము పాటలు అంతటా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. దానికి తోడు మాస్ లుక్ తో వదిలిన దమ్ము ప్రోమో కూడా అబిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సింహాద్రి వంటి మరో సూపర్ హిట్ ఎన్టీఆర్ నుంచి వస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం ఊసరవెల్లి చిత్రం ఫలితం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఊసరవెల్లి తో సమానంగా మొదలైన ఈ చిత్రం ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. 

No comments:

Post a Comment