Tuesday 10 April 2012

బరి నుంచి ‘ఈగ’ ఔట్... నలిపేస్తారని భయమా?


ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఈగ’ చిత్రం ఈ సమ్మర్లోనే ప్రేక్షకులను అలరిస్తుందని రాజమౌళి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సమ్మర్ బరి నుంచి ‘ఈగ’ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్రహీరోల సినిమాల జోరు తగ్గాక...అంటే జూన్ నెలలో ఈచిత్రాన్ని విడుదల చేయడనికి సన్నాహాలు చేస్తున్నారట. 

వాస్తవానికి ఆ అగ్రహీరోల సినిమాలతో పాటు రాజమౌళి ‘ఈగ’ చిత్రంపై కూడా వాటితో సమానమైన అంచనాలు ఉన్నాయి. యూట్యూబ్ లో అయితే అగ్రహీరోలందరినీ ‘ఈగ’ ఎప్పుడో దాటేసింది. ఈ లెక్క ప్రకారం అగ్ర హీరోల నుంచి పోటీని వీజీగా తట్టుకోగలదు.
అయితే డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారిన సాయి కొర్రపాటికి, ఆయన స్థాపించిన ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్‌కు ఇది తొలి చిత్రం కావడంతో ఎందుకైనా మంచిందని, థియేటర్లు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి కలెక్షన్లు తగ్గిపోతాయని, అదే జరిగితే ఈ పోటీలో ‘ఈగ’ నలిపిస్తారనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఈగ’ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు.

అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.

No comments:

Post a Comment