Tuesday 10 April 2012

మహేష్ పాటే... రవితేజ సినిమా టైటిల్



మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రంలోని ‘సార్ వస్తారొస్తారా’ అనే సాంగ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఈ పాట పేరునే మాస్ మాహారాజ రవితేజ తన సినిమా పేరుగా పెట్టుకుంటున్నారు. ‘సార్ వస్తారు’ టైటిల్ పేరుతో ఆయన చిత్రం రూపొందబోతోంది. 

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువత, సోలో చిత్రాలు దర్శకత్వం వహించిన పరశురాం ఈచిత్రానికి దర్శకుడు. ‘సార్ వస్తారు’ టైటిల్‌పై చాలా క్యాచీగా ఉండటంతో రవితేజ దీనిపై చాలా ఇంట్రస్టు చూపుతున్నట్లు సమాచారం. 


ప్రస్తుతం రవితేజ ‘దరువు’ చిత్రంలో నటిస్తున్నాడు.. శివ(శౌర్యం ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్‌తో పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా తీన్‌మార్‌ ఆడేస్తారు. ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని, చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు దిగడం అంటే మహా సరదా... అనే కాన్సెప్టుతో 'దరువు' సినిమా రూపొందిస్తున్నారు.

No comments:

Post a Comment