Monday 9 April 2012

ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పి పారిపోయాడు:చిరుపై బాబు


తిరుపతి: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తిరుపతిని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇక్కడ నుండి పారిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం విమర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వలె చిరంజీవి డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. ఆయన తిరుపతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత ఇప్పుడు పారిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తిరుపతిని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుపతిలో ఏనాడూ విద్యుత్ కోత విధించలేదని చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.


తిరుపతి ఖ్యాతిని అప్రతిష్టపాలు చేసిన ఘనత కాంగ్రెసుదేనన్నారు. సామాజిక న్యాయం ఎవరితోనూ జరగదన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. నాస్తికులకు వైయస్ రాజశేఖర రెడ్డి తిరుమల తిరపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ పదవులు కట్టబెట్టారని, వారు దేవుడి నగలను కరిగించారని, డాలర్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వారందరూ కలిసి దేవుడి సొమ్మును దిగమింగారని ఆయన అన్నారు.

తిరుపతి పక్కనే భూకబ్జాలకు పాల్పడ్డారని, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుటుంబానికి వైయస్ పదవులు కట్టబెట్టారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో తిరుపతిని అప్రతిష్టపాలు చేశారని ఆయన అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ఆయన చెప్పారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కిరాయి ఇళ్లలాంటివని, తెలుగుదేశం సొంత ఇల్లు లాంటిదని ఆయన అన్నారు. తమ పార్టీని వీడిపోయినవారు తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల కాంగ్రెసు పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

1 comment:


  1. Have a great career experience along with the Azure Training in Chennai from Infycle Technologies, the best software training institute in Chennai. Along with that, get up with other technical courses like Data Science Training, Selenium training, Cyber Security training, Big Data training with an outstanding training experience. For best offers, reach us on +91-7504633633, +91-7502633633.

    ReplyDelete